నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు
గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా
కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా ||నడి||
1.నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2)
అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2)
ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2)
ఆదరించే దేవుడు నా యేసయ్యా
ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||నడి||
2.ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2)
చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2)
ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2)
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా
ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||నడి||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment