757
ఆత్మనొసగుమయా పావనాత్మ నొసగుమయా శుద్ధాత్మ దేవా - శుభముల దాత - ఉజ్జీవ మీయుమయా ||ఆత్మ||
1.సీయోను గిరిపైన - ఉన్నత గృహమందు (2)
నీ ఆత్మ వరముల - నొందిన శిష్యుల - అనుభవ మీయువయా ||ఆత్మ||
2.యోర్దాన్ తీరమున - పావుర రూపమున (2)
నీ సుతుడేసుకు - ప్రభవించితివే - ఆ యాత్మ నొసగుమయా ||ఆత్మ||
3.జీవన యాత్రలో - ఎన్నెన్ని అవధులున్నా (2)
పునరుత్థాన - శక్తితో నింపి - నవజీవ మీయుమయా ||ఆత్మ||
4.ఈ మా సంఘములో - ఐక్యత సమకూర్చి (2)
పరిశుద్ధాత్మ - శక్తితో నింపి - పావన పరచుమయా || ఆత్మ||
– బిషప్ దైవాశీర్వాదం గోవాడ
No comments:
Post a Comment