ఆదరణ లేని నా జీవితాన
నన్ను ఆదరించిన మహనీయుడా
ఏ దిక్కు లేని నా జీవితాన
నన్ను చేరదీసిన నజరేయుడా
నా ఆశ్రయము నీవే - నా ఆధారం నీవే ||ఆదరణ||
1.దేవెనలే నాకు దూరమాయెను -
దీవెనలు ఇచ్చి ఘనపరచినావె (2)
ఘనుడా నిన్ను స్తుతియించి కొనియాడెదన్ - ఘనుడా నిన్ను కీర్తించి ఘనపరచెదన్ (2) ||ఆదరణ||
2.నా పాపము నన్ను పట్టించినా - నా ఎదుటే నిలచి దయ చూపినావే (2)
దయాలుడ నిన్ను స్తుతియించి కొనియాడెదన్ -
దయాలుడ నిన్ను కీర్తించి ఘనపరచెదన్ (2) ||ఆదరణ||
3. బలములేక నేను కృంగి పోతిని బలమునిచ్చి నన్ను బలపరచినావే (2)
బలవంతుడ నిన్ను స్తుతియించి కొనియాడెదన్ -
బలవంతుడ నిన్ను కీర్తించి ఘనపరచెదన్ (2) ||ఆదరణ||
No comments:
Post a Comment