అడుగుచున్నా మో దేవ కడు దయను Aduguchunnamo deva kadu dayanu

269
బోధకుల కొరకైన ప్రార్థన 
రా - శంకరాభరణం, తా - ఆది 

అడుగుచున్నా మో దేవ - కడు దయను గావఁ = జెడుగుల మైన మేము ని - న్నడుగుటకు నే బిడియ మొందము - అడుగుఁడి మీ కిడియెద నంచు - నాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు||

1.వేడు కలరఁగఁ గూడి నిను గొని - యాడి యడిగెడు నీదు భక్తులఁ = గోడు గని దయతోడ నెప్పుడు - వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||

2.సారె సారెకు నిన్ను విడిచి - ఘోర దురితపు భారమందుఁ = జేరి నిను మఱచితిమి గద మా - క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||

3.దుష్టుడు మాతోడఁ బోరఁగ - శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత = కష్ట మనక వాని గెల్వఁ - బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||

4.తోర మగు విశ్వాస నిరీక్షణ - కూరిమి విమలాత్మ వరములు = వారక హృదయాంతరంబులఁ - జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||

5.మోద మొప్పఁగ నీదు వాక్యము - మేదినిపై బోధపరచెడు - బోధ కులపై శోధనంబులు - పొర్లి రాకుండాదరింప ||నడుగు||

6.దురితముల చే భరితు లయ్యెడు - నరులపై నీ కరుణఁ జూపి = గురుతరంబగు మారు పుట్టుక - వరముఁ గుమ్మరించు మని ని ||న్నడుగు||

7.రోగములచే సేగి నొందుచు - జాగు సేయక నినుఁ దలఁచుచు = బాగు గోరుచు నున్న భక్తుల - రోగములు వెడలించు మని ని ||న్నడుగు||

8.ధరణిపైని మరణ మయ్యెడు - తరుణమందో కరుణా కలితా = పరమ పురమునందుఁజేరి - వర సుఖంబు లనుభవింప ||న్నడుగు||
- విలియం బెర్రీ 

No comments: