దీవెనల నిడు దేవా నీదు Deevenala nidu deva needu

270
సంఘసేవకుల కొరకైన దీవెన 
(ఛాయ: కరుణా సాగర)
రా - ముఖారి,     తా - ఆది 

దీవెనల నిడు దేవా నీదు - సేవకై వెడలెడు దీనులపైఁ = పావనాత్మ నంపుము - పనులలో నడిపింపుము - కేవలంబుగ మా తనువులు నీ - సేవకై యర్పింప గజేయుము ||దీవెనల||

1.మాటిమాటికి బాపయుతంబౌ - మార్గమునఁ జను మనసులఁ ద్రుంచి = మేటి క్రీస్తుని నామా - మృతముఁ గ్రోలుచు మేమా - పాటున నాత్మల రక్షణకై - పనులు సల్పగ బంపుము కృపచే ||దీవెనల||

2.దివ్య బోధ లెదను గల్గి - దీనతను రక్షణ మార్గమును = భవ్యముగ బోధింపఁ - బరమార్థ మెఱిగింప - సేవ్య నేర్పవె దిన దినమును నీ - సేవకాళికి నీ మర్మముల ||దీవెనల||

3.దురిత రోగాదులచే మిగులఁ - తూలి చను మనుజాళికి నీవే = పరమ విశ్రాంతి నిడు - వరదుఁడ వంచుఁగడు - వెరవునను బోధింపంగను నీ - వర ములతో నింపుము దాసులను ||దీవెనల||

4.గ్రామ సంఘంబులను బడుల - క్షేమముగఁ గాపాడి పెంప = ఓ మహాత్మ నీ కృప - తో మమ్ముఁ గాచి సదా - స్వామి మాలో నీవును నీలో మేము మనగను బ్రోవు మామేన్ ||దీవెనల||
- పంతగాని పరదేశి 

No comments: