03 May 2022

Ninne kori nee dari cheri | నిన్నే కోరి నీ దరి చేరి నీ ఓడిలో

నిన్నే కోరి నీదరి చేరి - 
నీ ఓడిలో నన్ను తల దాచుకొని (2)
కరుణ సాగర నాయేసు దేవా 
నీదరి చేరగా నను చేర్చుకోవా (2)

నా జీవిత పయనంలో చీకటి ముసిరిన వేళా (2)
నా దారి చూపిన నా యేసు దేవా 
వెలుగుతో నింపిన నా దైవ తనయ (2)
నిన్ను నేను వీడుదునా యేసువా ||నిన్నే కోరి||

గాఢాంధకారాన నే తొట్రిల్లిన వేళా (2)
నా కనుపాపల వెన్నంటి విడువక 
నా తోడు నీడగా నా కన్నా తండ్రివై (2)
దారి తొలగ నీయక కాపాడితివే ||నిన్నే కోరి||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...