Oka Kshanamaina Ninnu | ఒక క్షణమైనా నిన్ను వీడి

ఒక క్షణమైనా నిన్ను వీడి - ఉండలేనయ్య నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా - యేసయ్యా యేసయ్యా (2)
ఒక క్షణమైనా నిను వీడి - ఉండలేనయ్య నా యేసయ్యా

1. నశియించిపోతున్న నన్ను - బ్రతికించినావయ్యా యేసు
కృశించిపోతున్న నాలో - వేంచేసినావయ్యా యేసు(2)
నీ కార్యములెంతో - ఆశ్చర్యకరములయ్యా 
నీ వాగ్దానములెంతో - నమ్మదగినవయ్యా || యేసయ్యా ||

2. మతిలేక తిరిగిన నను - నీ దరి చేర్చినావయ్యా యేసు
శ్రమ చేత నలిగిన నాకు - వరమిచ్చినావయ్యా యేసు (2)
నీ ఆలోచనలెంతో - లోతైన దీవెనయ్యా
నీ తలపులు ఎంతో - మధురము నా యేసయ్యా ||యేసయ్యా||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: