VISWASAMU LEKUNDA DEVINIKI | విశ్వాసము లేకుండా దేవునికి

విశ్వాసము లేకుండా దేవునికి - ఇష్టులైయుండుట అసాధ్యము 
విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు...

హానోకు తన మరణము చూడకుండ - పరమునకు ఎత్తబడి పోయెనుగా 
ఎత్తబడక మునుపే దేవునికి - ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా || 

నోవహు దైవభయము గలవాడై - దేవునిచే హెచ్చరించబడిన వాడై 
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి - నీతికే వారసుడని సాక్ష్యమొందెను || విశ్వా || 

మోషే దేవుని బహుమానము కొరకై - ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి 
శ్రమలనుభవించుటయే భాగ్యమని - స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను || విశ్వా || 

వీరందరు సాక్ష్యము పొందియున్నను - మనము లేకుండా సంపూర్ణులు కారు 
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో - మరి శ్రేష్టమైన సీయోనుకే సిద్ధపడెదము || విశ్వా ||

No comments: