Viluveleni naa Jeevitham | విలువేలేని నా జీవితం

విలువేలేని నా జీవితం - 
అది ఎంతో విలువని నాకు చూపితివే 
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు - నీ జీవితాన్నే దారబోసితివే (2)

నీది శాశ్వత ప్రేమయ - నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు 
ఎండిన ప్రతి మోడును - మరల చిగురించును 
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)

పాపములో పడిన నన్ను - శాపములో మునిగిన నన్ను 
నీ ప్రేమతో లేపితివే - రోగమే నన్ను చుట్టుకొని యుండగ 
రోధనతో ఒంటరినై యుండగ - నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది||

పగలంతా మేఘస్తంభమై - రాత్రంతా అగ్నిస్తంభమై 
దినమంతయు రెక్కలతో కప్పిటివే - స్నేహితులే నన్ను వదిలేసిన 
బంధువులే భారమని తలచిన - నా కొరకే బలియైతివే  (2) ||నీది|| 

సాధ్యమే .. సాధ్యమే ... సాధ్యమే 
నా యేసుకు సమస్తము సాధ్యమే .. సాధ్యమే ... సాధ్యమే 
నా ప్రియునికి సమస్తము (2) 
ఎండిన ప్రతి మోడును - మరల చిగురించును 
నా దేవునికి సమస్తము - సాధ్యమే (2) ||విలువెలేని||

No comments: