24 December 2021

Nisheedi raathrilo | నిశీధి రాత్రిలో దేదీప్యమై


నిశీధి రాత్రిలో - దేదీప్యమై వెలిగెను 
వింతైన తార - గగనములోన 
ఆకర్షించెను - జ్ఞానులన్వేషించిరి … 

1.దీనులైన గొల్లలను ఎన్నుకున్న రాత్రి 
గొల్లలు మందను - కాయుచుండగా 
దూతవారిని దర్శించెను - శుభవార్తను తెలిపెను
దావీదు పట్టణములో రక్షకుడు - జన్మించెను మీకోసమే 
ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే - ఆ రాత్రిలో 

2. పరలోక సైన్య సమూహము 
స్తుతియించె - దేవుని ఆ రాత్రిలో 
సర్వోన్నతమైన స్థలములలో - దేవునికి మహిమయు
తనకిష్టులైన మనుష్యులకు - భూమి మీద సమాధానము 
ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే - ఆ రాత్రిలో

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...