Entha chithramo emi chodyamo | ఎంత చిత్రమో ఏమి చోధ్యమో

ఎంత చిత్రమో - ఏమి చోధ్యమో (2) 
యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో 
యేసయ్య నీ ఆగమనం ఎంత చోధ్యమో ||ఎంత||

1. ఆకాశ మహాకాశములే - పట్టజాలని దేవుడవు
అణువంత రూపుదాల్చి - కన్య గర్భము చేరావు (2)
లోకాలే ఏలేటి నీవు - పసికూనై ఒడిచేరినావు (2) 
ఊహకు అందదూ నీ వింత త్యాగం. త్యాగం ||ఎంత||

2. దూతలతోమహదూతలతో - మహిమనొందే దేవుడవు
ఘనమహిమ నీవువిడిచి - మట్టిమనిషిగా మారావు (2)
పాపులను రక్షింపనీవు - బలియాగం కాగోరినావు (2)
ఉన్నతమైనది నీ ప్రేమ చరితం . చరితం ||ఎంత||

No comments: