Dootha paata paadudi | దూత పాట పాడుడీ

127
Hark! the herald Angles sing

1.దూత పాట పాడుఁడీ - రక్షకున్ స్తుతించుఁడీ 
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్ 
భూజనంబు కెల్లను - సౌఖ్యసంభ్ర మాయెను 
ఆకసంబునందున - మ్రోగు పాట చాటుఁడీ 
దూత పాట పపాడుఁడీ - రక్షకున్ స్తుతించుఁడీ.

2.ఊర్ధ్వలోకమందునఁ - గొల్వఁగాను శుద్ధులు అంత్యకాలమందున - కన్యగర్భమందున 
బుట్టినట్టి రక్షకా - ఓ యిమ్మానుయేల్ ప్రభో 
ఓ నరావతారుఁడా నిన్ను నెన్న శక్యమా? 
దూత పాట పాడుఁడీ - రక్షకున్ స్తుతించుఁడీ

3.దావె నీతి సూర్యుఁడా - రావె దేవపుత్రుఁడా 
నీదు రాకవల్లను - లోక సౌఖ్య మాయెను 
భూనివాసు లందఱు - మృత్యుభీతి గెల్తురు 
నిన్ను నమ్మువారికి - ఆత్మశుద్ధి కల్గును 
దూత పాట పాడుఁడీ - రక్షకున్ స్తుతించుఁడీ 
- చార్లెస్ వెస్లీ.
 - అను: జే. ఈ. ఫాడ్ ఫీల్డ్.
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: