114 జ్ఞానులు క్రీస్తును ఆరాధించుట
రా - శంకరాభరణం తా - ఆది
జ్ఞాను లారాధించిరి - యేసు ప్రభునిఁ - బూని పాపులఁ బ్రోవ మెనిఁ దాల్చిన తరి ||జ్ఞాను||
1.చాల కాలము నుండి - మేలు వార్త నాసక్తి - నాలకించి నక్షత్ర - కాల చిహ్నముఁ గూడి = మేలు మేలని - మ - మ్మేలు వాఁడని - మంచి - బోళము సాంబ్రాణి వేసి ||జ్ఞాను||
2.దూర మనక యాత్ర - భార మనక బయలు - దేరి సంతోషముతోఁ - జేరి మేలిమి బం = గార మిచ్చిరి - మన - సార మెచ్చిరి జో - హారు జోహారటంచు ||జ్ఞాను||
3.ఈ దివసంబున - బేత్లెహేమను నూర - యూదుల రాజుగాఁ - బాదుకొన్నయేసు = నాధ స్వామిని - స - మ్మోద మిమ్మని - య - య్యూదజనుల మధ్య ||జ్ఞాను||
4.ఈ సమయము మన - మా సమయంబుగఁ - జేసి స్తుతింపను - జేరితి మిచ్చోట = భాసురంబగు - శ్రీ - యేసు నాధుని - హృద - యాసనంబునఁ జేర్చి ||జ్ఞాను||
- బేతాళ జాన్
No comments:
Post a Comment