Dhatri Nedu Rakshakundu | ధాత్రి నేడు రక్షకుండు

ధాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
నేడెంతో ముదమొందగా - ఈ పాపి రక్షణార్ధమై (2)

లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను -
లోక నాథుడై మరియ కవతరించెను (2)
ఇతండె దేవుడాయెను - ఇతండె దేవుడాయెను (3) ||ధాత్రి||

బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము -
యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)
ఈ నాడే మనకు పండగ - రారండి ఆడి పాడగ (3) ||ధాత్రి||

ఆకశాన తార ఒకటి బయలుదేరెను - 
తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)
చిన్నారి యేసు బాబును - కళ్లారా చూసి మురిసెను (3) ||ధాత్రి||

పొలములోని గొల్లవారి కనుల ముందర - 
గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2)
మేరమ్మ జోల పాడగా - జగాలు పరవశించెగా (3) ||ధాత్రి||

లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను -
భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2)
ఇతండె దేవుడాయెను - ఇతండె దేవుడాయెను (3) ||ధాత్రి||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: