03 November 2021

Dayachesi Chudave | దయచేసి చూడవే

దయచేసి చూడవే అందాలతార - 
మా ఇంటిదాక ఒకసారి రావే
అలనాడు నీవు గగనాన నిలచి - 
ప్రభుయేసు చూచి తరియించినావే (2)

1.ఎక్కడెక్కడ యేసు పెరిగెనో - 
పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో - 
తల్లిదండ్రికి తగిన బిడ్డగా - 
గురువు దైవమనే భక్తి ఎదను నిండగా 
ఆకాశమందుండి నువు చూసి నావు (2)
కరుణతో తనకథ తెలియ జేయవే - 
ఓ నింగితార మా ఆశ తీర - 
శ్రీయేసు చరితం వినిపించిపోవే ||దయచేసి||

2.ఎప్పుడెప్పుడు ఏమి చేసెనో - 
ఆ మహిమలన్ని నింగినుండి చూసినావుగా - 
మేము చదవని క్రీస్తుబోధలు - 
తప్పకుండ నీకు తెలిసివుండి తీరునే 
ఆ బోధలన్ని వివరించ రావే (2)
జీవితం ధన్యమై బ్రతుకు సాగాని - 
అందాలతార యెరిగించి పోవే - 
మా జీవితాలు వెలిగించిపోవే ||దయచేసి||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...