Snehithuda naa snehithuda | స్నేహితుడా నా స్నేహితుడా

స్నేహితుడా నా స్నేహితుడా - నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే - నిజమైన స్నేహితుడా (2)

నన్నెంతో ప్రేమించినావు - నాకోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము - మరచి ఇల నే మనగలనా (2) || స్నేహితుడా||

నా ప్రాణ ప్రియుడా నీ కోసమే - నే వేచాను నిరతం నీ తోడుకై (2)
ఇచ్చెదన్ నా సర్వస్వము - నాకున్న ఆశలు ఈడేర్చుము (2) || స్నేహితుడా || 

కన్నీటితో ఉన్న నన్ను - కరుణించి నను పలుకరించావు (2) 
మండిన ఎడారిలోన - మమత వెల్లువ కురిపించినావు (2) || స్నేహితుడా ||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: