ఎడబాయని నీ కృప - నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం - నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం – ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా – నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని||
విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి - ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా - నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని||
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను - ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు - నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
– మాథ్యూస్
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment