ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా - కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం||
లోకంలో ఎన్నో జయాలు - చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
ఐశ్వర్యం కొదువేమి లేదు - కుటుంబములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
నీ సేవకునిగా జీవింప - హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం||
– S Rajasekhar
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment