Neetho Nenu Naduvaalani | నీతో నేను నడవాలనీ

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా

నీతో నేను నడవాలనీ - నీతో కలిసి వుండాలని
ఆశయ్య చిన్న ఆశయ్యా .. ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ||నీతో|| 
 
1  నడవలేక నేను ఈ లోకయాత్రలో  - బహు బలహీనుడ నైతినయ్య (2)
నా చేయిపట్టి నీతో నన్ను - నడిపించుమయ్యా నా యేసయ్యా (2). ||ఆశయ్యా|| 

2. సౌలును పౌలుగా మార్చిన నాగొప్ప దేవుడా (2)
నీలో ప్రేమ నాలోనింపి - నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా వుండాలని.. నీతో వుండాలని.. చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ॥ఆశయ్యా॥

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: