13 October 2021

మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురనెను - యెహేజ్కేలు 36: 11

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం.🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪
✝️ *సంతృప్తికరమైన మేలు* ✝️

మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, 
 - యెహేజ్కేలు 36: 11 


మీరు అన్యజనుల యొద్ద అవమానము పొందితిరా? దేవుడు మీకు మేలు చేయ సిద్ధపడియున్నాడు. దేవునికి ఇష్టమైన తన జానంగమైన ఇశ్రాయేలీయులకును తన సొత్తుగా పిలవబడిన నీతోను దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు.నా మాట అలకించుము మీరు అన్యజనుల వలన గాని, శత్రువుల వలన గాని, అవమానము పొందితిరేమో! నేను మీకు రోషముతో మాట ఇస్తున్నాను. మీ చుట్టూ వున్న అన్యులు,  శత్రువులు అవమానము నొందుదురు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న నీవు ఆయనకు కోపం రేపే వారిగా కాక ఆయనకు ఇష్టమైన జనాంగముగా ఉండి ఆయన ఇచ్చిన వాగ్దానం పొందుకొనేవారిగా ఉండాలి. శత్రువులకు భయపడవద్దు. నీవు అడుగువాటిన్నిటి కంటే, ఉహించువాటిన్నింటి కంటే అత్యధికంగా అనుగ్రహించువాడు నీ దేవుడు.

🛐ప్రార్ధన:-🛐
ప్రియ ప్రభువా మా పాప స్థితి మరియు కీడుల నుండి విడిపించి మేలుతో తృప్తిపరచుమని యేసు నామములో ప్రార్ధన్ చేస్తున్నాము పరమ తండ్రి ఆమెన్

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...