12 October 2021

సంతోషము గల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతలు - 17:22

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం.🙏..

⛪నేడు దిన ధ్యానము:-⛪
 
✝️(((సానుకూల వైఖరి)))✝️

సంతోషము గల మనస్సు ఆరోగ్యకారణము.
నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. - సామెతలు - 17:22 

ఈ రోజుల్లో వైద్యులు, ఎన్నో రకాల రోగాలను, వ్యాధులను నయం చేయడానికి “సానుకూల వైఖరి” కి (positive attitude) చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందరూ “సిద్ధంగా, ఇష్టంగా ఉన్న హృదయం, అనేక అద్భుతాలను చేయగలదు” అనే ముగింపుకు వచ్చారు. పరిశుద్ధ గ్రంధము (బైబిల్) ఆ మాటలను ఎప్పుడో చెప్పింది. అవును అది నిజమే. మనస్సు సంతోషంగా ఉంటే, ఔషధాలు, మందులు కూడా, త్వరగా పనిచేస్తాయి. మన మనసులకు ఒక ప్రశ్న రావచ్చు. “నా చుట్టూ ఇన్ని సమస్యలుంటే, నేనెలా సంతోషంగా ఉండగలను?” అని. కానీ, అన్ని సమస్యల మధ్య కూడా, అత్యంత శక్తి గల దేవుని మీద విశ్వాసముంచి, ప్రతి సమస్యనూ పరిష్కరించగల ఆయన సామర్థ్యం మీద నమ్మకము ఉంచి, సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి. సానుకూల వైఖరి అంటే మన సమస్యలను, భాద్యతలను విస్మరించడం కాదు. కానీ, ఆశావాదిగా ఆలోచిస్తూ, మంచే జరుగుతుందన్న భావన కలిగి, నిరాశావాదాన్ని విడిచిపెట్టాలి. మనమెప్పుడూ, ప్రతికూల ఫలితాల గురించే ఆలోచిస్తే, మన హృదయం, ఆత్మ కృంగిపోయి నలగ గొట్టబడి ఆరోగ్యం పాడవుతుంది. కనుక మన గొప్ప రక్షకుడైన యేసయ్య వైపు చూస్తూ, సానుకూల వైఖరితో, జీవితంలో ముందుకు సాగి వెళ్ళుదాము.

🛐ప్రార్థన:🛐

ప్రియ ప్రభువా, సానుకూల వైఖరితో జీవితంలో ముందుకు వెళ్తూ, సంతోషము గల మనస్సు కలిగి, మంచి ఆరోగ్యముతో బ్రతకడానికి నాకు నేర్పించమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

👉ప్రతి రోజూ నేను సానుకూల వైఖరితోనే లోపలికి వచ్చి, ఇంకా మంచిగా కావాలని కోరుకుంటుంటుంటాను. – స్టీఫాన్ డిగ్స్ .

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...