ఆయన ఆశ్రయించుటయే మేలు

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం.🙏..
 ⛪నేడు దిన ధ్యానము:⛪-
✝️ *ఆయన ఆశ్రయించుటయే మేలు*✝️

యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.- కీర్తనలు -   34:10

యెహోవాయందు భయభక్తులు కలిగిన వానికి అనుగ్రహింపబడే ఆశీర్వాదాలు గురించి దావీదు వ్రాస్తున్నాడు.

నీ జీవితంలో ఏ బాధ వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, మనుష్యులను ఆశ్రయిస్తే ప్రయోజనమేమీ ఉండదు, సరికదా ఆ విషయాల గురించి ఇతరులకు చాటిస్తారు. అందుకే యెహోవాను ఆశ్రయించి నీ కష్టం ఆయనతో మాత్రమే చెప్పుకుంటే ఆయన నీ మొర ఆలకించి సహాయం చేస్తాడు.

యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. గాతులో నుండి ఫిలిష్తీయులు తనను అవమానించి, బయటకి నెట్టివేయడం బహుశా దావీదు గుర్తు చేసుకుని ఉండవచ్చు. గాతునుండి బయటపడి తిండి,నీళ్లు లేక ఒంటరిగా ఆదరించేవారు లేకుండా ఉన్నాడు అయితే దేవుడు అతనితో ఉండి, అతని అవసరతలను తీర్చి క్షేమంగా అదుల్లాము గుహకు చేర్చాడు. యూదా కొండలలో ఆకలితో సింహపు పిల్లలు అరవడం దావీదు వింటున్నాడు. అయితే దేవుని వెదకు వారికి కొదువలేదు. దావీదు తన దగ్గర ఉన్న మనుషులను చూస్తున్నాడు వారికి కొన్ని పద్ధతులను నియమాలను నేర్పించాలి అని తన అనుభవంలో తను నేర్చుకున్న వాటిని మనకు నేర్పిస్తున్నారు.

🛐ప్రార్ధన:-🛐
దేవా ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు అనిపించుచుకునేవారు ఇవ్వని గొప్ప నిరీక్షణ, నీవు నాకు అనుగ్రహించుచున్నావు. నిన్ను ఆశ్రయించుటకు నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

No comments: