ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. - 1పేతురు 2: 24

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం...🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️దేవుడు నిజమైతే ప్రపంచంలో ఎందుకు చెడు ఉంది?✝️

ఈ ప్రశ్నకు జవాబు మరొక ప్రశ్నతో చెప్పాలంటే: “ప్రపంచంలో సబ్బు ఉంటే, చాలా మంది ఎందుకు మురికిగా ఉన్నారు?”

మనలో చాలామంది నమ్మేదేమిటంటే మన జీవితంలో జరిగిన ప్రతీ విషయం కూడా దేవుని చిత్తం అని. కానీ మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, దేవుని చిత్తం మన జీవితంలో స్వయంచాలకంగా (automatically) జరగదు. దేవుని చిత్తాన్ని మనం అనుసరించి నడిచినప్పుడు అది జరుగుతుంది.

ఒక ఉదాహరణకి, మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మరియు అది ఒక మంచి వ్యక్తికి జరిగితే, మనం ఎందుకు ప్రభువు ఎందుకు? నాకే ఎందుకు ? అని ఆర్కెస్ట్ర లాగ అరుస్తాము మరియు దేవునిపై కోపం తెచ్చుకుంటాము.

1 పేతురు – 2 : 24 ఆధారంగా, దేవుని చిత్తం ఏమిటంటే “యేసు క్రీస్తు సిలువమీద పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి” అనేదే. మరియు అది మీ జీవితంలో జరగకపోతే/చూడకపోతే, మీ జీవితంలో దేవుడు స్వస్థతను కోరుకోలేదు , మీకు స్వస్థతతని దేవుడు ఇవ్వలేదు అని కాదు. దానికి అర్థం ఏమిటంటే మీరు ఆయన చిత్తాన్ని మీ జీవితంలో సరిగ్గా అర్థం చేసుకోలేదు అని.

మీ జీవితంలో ఆయన చిత్తాన్ని మీరు తెలుసుకుని, విశ్వసించిన తర్వాత, అది మీ జీవితంలో దాని ప్రభావాన్ని విడుదల చేయడం ప్రారంభిస్తుంది.

కాబట్టి మీ జీవితంలో జరిగే తప్పుడు పనులకు దేవుణ్ణి నిందించవద్దు. అది దేవుడి తప్పు కాదు. ఆయన వాగ్దానాలను తెలుసుకోండి అప్పుడు మీరు యేసు నామంలో ఆ పరిస్థితులన్నిటిని జయించి నడుస్తారు!

🛐ప్రార్థన:🛐
తండ్రీ, మీరు మంచివారని నాకు తెలుసు. నా కష్టాలు, ఇబ్బందులు మరియు అనారోగ్యం ఇవన్నీ మీ తప్పులు కాదు. యేసుక్రీస్తు విశ్వాసిగా, అనారోగ్యం, ఇబ్బందులు మరియు కష్టాలపై నాకు అధికారం ఉంది. దయచేసి సత్యాన్ని చూడటానికి నా కళ్ళు, చెవులు మరియు హృదయాన్ని తెరిచి, నా జీవితానికి సంబంధించిన మీ ప్రణాళికలను అర్థం చేసుకోని మరియు దాని ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

No comments: