05 October 2021

నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్యసమాధానములను సమృద్ధిగా బయలు పరచెదను. యిర్మీయా - 33:6



🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:⛪

 ✝️ *ఆరోగ్యము మరియు స్వస్థత* ✝️

నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్యసమాధానములను సమృద్ధిగా బయలు పరచెదను. 
- యిర్మీయా 33:6.

ఒక్కొక్కసారి మనమెన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొన్ని వ్యాధుల నుండి బయట పడలేము. ఎంత మంది వైద్యుల చుట్టూ తిరిగినా కూడా ఫలితముండదు. కొన్ని కొన్ని సార్లు ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలా సుళువుగా వైద్యం చేసికొని బయటకు వస్తారు. కానీ కొన్ని వ్యాధులకు ఎంత మంది వైద్యుల దగ్గరికు వెళ్లినా స్వస్థత దొరకదు. ఈ పెద్ద పెద్ద వైద్యశాలల చుట్టూ తిరిగి, అనేక వేల, లక్షల ఖర్చు చేసి మన శాంతినంతా కోల్పోతాము. ఒక ప్రక్క శారీరక భాధ, మరొక ప్రక్క మానసిక ఒత్తిడి, ఇంకొక ప్రక్క ఆర్ధిక ఇబ్బందులతో మన సంతోషమంతా వెళ్ళిపోతుంది. కానీ మన గొప్ప దేవుడు ప్రతీ సమస్యకు పరిష్కారము చూపిస్తున్నారు. ఆయన “నేను మీకు ఆరోగ్యమును, స్వస్థతను మరల రప్పించుచున్నాను” అంటున్నారు. మనమందరమూ మంచి ఆరోగ్యముతో ఆనందిస్తూ, దైవికమైన ఆరోగ్యమును కలిగి ఉండటం దేవుని చిత్తం. మనమేరకమైన అనారోగ్యముతో భాధ పడుతున్నాకూడా ఆయన “నేను నిన్ను స్వస్థపరుస్తాను” అంటున్నారు. అంతే కాదు ఇంకా ఆయన “మనకు సత్యము, సమాధానము సమృద్ధిగా ఇస్తాను” అంటున్నారు. అప్పుడాయన యందు మనము సంతోషిస్తాము. కనుక మనము “ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగియున్నది” అని ఒప్పుకుందాము. యెష 53:5. దేవుడు మన ప్రతీ ఒక్కరికీ దైవికమైన మంచి ఆరోగ్యమును అనుగ్రహించును గాక.

🛐ప్రార్థన:🛐

ప్రియ ప్రభువా, మమ్ములను స్వస్థపరచి, మంచి ఆరోగ్యము నిచ్చి, దీర్ఘ ఆయువుతో తృప్తి పరచండి. ఇంకా మీ కృప వలన, సమృద్ధిగా సత్యసమాధానములను అనుభవించి, ఆనందించే భాగ్యము మాకివ్వమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

నిర్గమ కాండము 15:26 లో దేవుడు అంటున్నారు “నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.”

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...