03 October 2021

"నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి”.- 1 పేతురు- 5:8

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
నేటి దిన ధ్యానము

✝️ *మెలకువగా ఉండుడి* ✝️

 “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా  ఉండుడి”.
  1 పేతురు 5:8  

మనము తరచూ నోవాహు ఉన్నప్పటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము. సాతాను దాడిచేయబోతున్నాడని ఏదో ముప్పు వాటిల్లబోతుందని మెలకువ కలిగి దేవుని వాక్యమునందు విశ్వాసముంచి వాటిని ఎదురించి నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ముందుచూపు లేకుండా, గ్రుడ్డివారుగా ఉంటే అపవాది యొక్క వ్యూహాలలో చిక్కుకుపోతాము.

అపవాది మొదట నిన్ను అబద్ధం ద్వారా మోసపుచ్చుటకు ప్రయత్నిస్తాడు. దేవుడు సత్యవంతుడు ఆయన ఎల్లప్పుడు సత్యమునే పలుకుతాడు. అపవాది అబద్ధికుడు వాడెల్లప్పుడూ అబద్ధములే పలుకుతాడు.

దేవుని హృదయంతో నీ హృదయం ఏకీభవించుటకు నిశ్చయించుకొనుము. దేవుడు సిలువయాగము ద్వారా మనకు అపవాదిని జయించే శక్తిని ప్రసాదించాడు. గనుక సాతాను యత్నాలను ఎదుర్కోవడానికి మెలకువ కలిగి అప్రమత్తంగా నడుచుకుందాము.

🛐ప్రార్థనా🛐
ప్రియమైన తండ్రి, మెలకువ కలిగి నడుచుకోమని నన్ను హెచ్చరించినందుకు నీకు వందనములు. ప్రతీ విధమైన శోధనను జయించుటకు నీయందు ఆధారపడియుండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

👉 ప్రతి ఉదయం నేను నిద్రలేచి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాను- ఆరోన్ నెవిల్లే

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...