05 October 2021

ఫలవంతముగా ఉండుడి

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪

✝️ *ఫలవంతముగా ఉండుడి* ✝️

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.
 – యోహాను సువార్త 15:5 

మనం తోటమాలిని గమనించినట్లయితే, చాలాసార్లు అనేక కొమ్మలను కత్తిరించి వేస్తుంటాడు, ఒక చెట్టు గానే, పొద కానీ, మొక్క కానీ బాగా ఎదగాలంటే కొన్ని కొమ్మలను విరిచి వేయాలి. ఒక్కొక్కసారి కొమ్మలను తల్లి చెట్టు నుండి వేరు చేసి దానిని వేరే బలిష్టమైన శ్రేష్టమైన చెట్టులో అంటు కట్టుతారు. ఇవన్నీ తోటమాలి యొక్క గొప్పతనాన్ని చూపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు ఇలా అంటున్నారు " నేను ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు". యేసుక్రీస్తు ప్రభువు చెట్టు వేరు, ఆయన వేరు లోని సారము కొమ్మలమైన మనలోనికి వ్యాపించినప్పుడు, మనము బహుగా ఫలిస్తాము.

అప్పుడాయన మహిమ పరచబడతారు. ఆయన లేకుండా మనము ఎందుకూ పనికిరాము. కొంత మంది తమ సొంత శక్తితో, జ్ఞానంతో, డబ్బుతో, తెలివితో, బలముతో ఎన్నో కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనకు ఎన్ని ప్రతిభలున్నా, ఎంత గొప్ప తనం ఉన్నా , యేసయ్య లేకుండా మన జీవితాలు వ్యర్థమే.

ఎప్పుడైతే మనము మంచి ఆరోగ్యంతో, ఆస్తులతో, గొప్ప ఉద్యోగాలతో, జ్ఞానంతో, తెలివితో, ఆశీర్వదించబడి , నిజమైన క్రైస్తవులలాగా ప్రవర్తిస్తామో అప్పుడు మనము, పని చేస్తున్న స్థలాలలో, ఇరుగు పొరుగున ఉన్న వారి ఎదుట, స్నేహితులు, బంధువుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువును చూపించగలిగినప్పుడు, మన జీవితాల ద్వారా ఆయన మహిమ పరచబడుతారు.

మనము ఆత్మ ఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, అనే ఆత్మ ఫలాలను ధరించాలి. అప్పుడు మనము ఆయనకు సజీవ సాక్షులుగా ఉంటాము .

🛐 ప్రార్థన: 🛐

పరలోకపు తండ్రి మీ లోనే నమ్మకముగా ఉండి మీ లోనే ఎదుగుతూ, బహుగా ఫలించడానికి మరియు మీకు మహిమ తీసుకురావడానికి, మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ !

👉క్రీస్తుతో ఆక్రమించబడి ఉంటే, క్రీస్తు లో నిలిచి ఉండుటయే. – ఆండ్రు ముర్రే.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...