02 October 2021

భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.- మత్తయి:6:20

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
⛪ నేటి దిన ధ్యానము ⛪
✝️ *పరలోకపు ధనం* ✝️
భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.
- మత్తయి: 6 : 20

మనకందరికీ అలెగ్జాండర్ ది గ్రేట్ అనే మహా గొప్ప రాజు, చక్రవర్తి గురించి తెలుసు. అతడు తక్కువ వయస్సులో 32 లోనే మరణించాడు. అతడు చనిపోక ముందే తన మనుషులతో అతడు చనిపోయిన తర్వాత తన శరీరము ఒక శవపేటికలో ఉంచమని, కానీ చేతులు మాత్రమే బయట పెట్టమని చెప్పాడు. ఎందుకంటే తను చనిపోయేటప్పుడు ఈ లోకము నుండి ఏమి కూడా తీసుకొని పోవడం లేదని. వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని ఈ లోకం తెలుసుకోవాలని అతని చివరి కోరిక.

అనేక యుద్ధాలను జయించిన గొప్ప చక్రవర్తి, వట్టి చేతులతోనే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇది ప్రతి ఒక్కరికి జరిగేది. మనం ఎంత ధనవంతులైనా, అందమైన వారి మైన, తెలివిగల వారమైన, అనేక ప్రతిభలున్నా, చివరికి వట్టి చేతులతోనే మనం ఈ లోకాన్ని విడిచి పెట్టాల్సి ఉంటుంది.

అందుకే యేసయ్య మనలను పరలోకపు ధనాన్ని సమకూర్చుకొనమని చెప్పారు. అక్కడ మన ధనాన్ని దొంగలు దొంగలించరు. మన ఆస్తిని ఎవరు కొట్టి వేయరు. పరలోకపు ధనం ఈ లోకంలో మనం ఎన్ని ఆత్మలను సంపాదించుకున్నాం అనేదానిమీద సంబంధించి ఉంటుంది. కనుక మనం దేవుని రాజ్యం కొరకు కష్టపడి పని చేద్దాం. మన శక్తిని, ఆరోగ్యాన్ని, డబ్బును, సమయాన్ని, ప్రతిభను దేవుడు రాజ్య వ్యాప్తికై వెచ్చిద్దాము.

🛐ప్రార్థన🛐
ప్రభువా ఈ లోకంలో మేము అనేక ఆత్మలను యేసు నామమున గెలిచి పరలోకపు ధనాన్ని సమకూర్చుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి . ఆమెన్.

👉ఈ లోకంలోని మనుష్యులను పరలోక రాజ్య వారసులుగా చేయడం ద్వారా నీవు పరలోకములో ధనాన్ని సమకూర్చుకోవచ్చు. – రిక్ వారెన్

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...