02 January 2022

Neethone na sahavasam | నీతోనే నా సహవాసం నీతోనే

నీతోనే నా సహవాసం - నీతోనే నా అనుబంధం (2)
నీవేనా ప్రాణాధారము యేసయ్య - నీవేనా ఆశదీపము (2)

కారు చీకట్లు నన్ను కమ్ముకున్న వేళ
పెను తుఫానులో నేను చిక్కుకున్న వేళ (2)
వెలుగుగా నీవే వచ్చి దారి చూపినావయ్య (2)
నా మంచి నాయకుడవై నా దోనెను నడిపావు (2)
నీ వేనా ప్రాణా ధారము యేసయ్య….
నీవేనా నా ఆశదీపము…

కన్నీటి సంద్రములో నేను ఉన్నవేళ (2)
కష్టాల కడలే నన్ను కృంగ దీసిన వేళ (2)
నా తల్లి తండ్రివై కన్నీరు తుడిచావు (2)
కష్టాలలో తోడుండి నన్నులేవనెత్తావు (2)

పాపములో నేను పడి ఉన్నవేళ (2)
శాపములో నేను చిక్కుకున్న వేళ (2)
నీ రక్తముతో కడిగి శుద్దినిగా చేశావు (2)
నీ హస్తమే చాపి నన్ను లేవా నెత్తావు (2)
                                 పాస్టర్: వేపూరి

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...