ANNI SAADHYAME YESUKU | అన్నీ సాధ్యమే యేసుకు

అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) 
అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యము లొసగుటకైనా (2) 
ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) || అన్నీ సాధ్యమే ||

అన్నీ మాధుర్యమైన జలముగా - మారాను ప్రభు మార్చెను -
మృత్యువు నుండి లాజరును - మాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగా - ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా - మృత్యుంజయుడై లేచెను (2) || అన్నీ సాధ్యమే || 

బండనే చీల్చగా - జలములే పొంగెను 
ఎండిపోయిన భూమిపై - ఏరులై అవి పారెను (2) 
బండంటే క్రీస్తేనని - నీ దండమే తానని 
మెండైన తన కృపలో - నీకండగా నిలచును (2) || అన్నీ సాధ్యమే || 

ఏకాంతముగా మోకరి - ప్రార్ధించుటే శ్రేయము ఏల నాకీ శ్రమలని - పూర్ణ మనసుతో వేడుము (2) యేసయ్య నీ వేదన - ఆలించి మన్నించును ఏ పాటి వ్యధలైననూ - ఆ సిల్వలో తీర్చును (2) || అన్నీ సాధ్యమే || 

కష్టాల కడలిలో - కన్నీటి లోయలో - కనికరమే ప్రభు చూపును - కంటిపాపలా కాయును (2) 
కలిగించు విశ్వాసము - కాదేదీ అసాధ్యము క్రీస్తేసు నామములో - కడగండ్లకే మోక్షము (2) || అన్నీ సాధ్యమే ||

No comments: