Vishwakaashamu laadulanu | విశ్వాకాశము లాదులను

592
The Creed

1.విశ్వాకాశము లాదులను 
సృష్టించిన విభుఁ డగు పరమ 
ఈశుఁడు సర్వశక్తుఁ డగు || 
భాసుర తండ్రిన నమ్ముదును || 
నమ్ముదును నే నమ్ముదును ||

2.పరిశుద్ధాత్ముని మూలమున 
మరియ కన్యకా గర్భమున 
ధరియింప బడి పుట్టిన శ్రీ 
గురు ప్రభుయేసును నమ్ముదును 
నమ్ముదును నే నమ్ముదును ||

3.పొంతి పిలాతుని కాలమున 
నెంతో శ్రమపడి సిల్వఁబడి 
వింతగ మృతి భూస్థాపనయు
పొంది యధోతుల మందెనని || 
నమ్ముదును నే నమ్ముదును ||

4.మూఁడవనాఁడు మృతి నుండి 
వడిగాఁ బునరుత్థానుండై 
చూడఁగ బరమున కేతెంచె 
నాధుని కుడియెఁడ గూర్చుండెన్ || 
నమ్ముదును నే నమ్ముదును ||

5.అక్కడ నుండి యిహమునకుఁ 
గ్రక్కున వచ్చి సజీవులకు 
నిక్కము న్యాయముమృతులకును 
జక్కగఁ దీర్చెడు నని మదిని || 
నమ్ముదును నే నమ్ముదును || 
నమ్ముదును నే నమ్ముదును ||

6.పరిశుద్ధాత్ముని నమ్ముదును 
నమ్ముదును నే నమ్ముదును 
పరిశుద్ధాత్ముని నమ్ముదును 
నమ్ముదును నే నమ్ముదును ||

7.పరిశుద్ధ పరచంబడిన 
సర్వసాధారణ సంఘం 
పరిశుద్ధుల యన్యోన్య మగు 
పరిశుద్ధ స్నేహము కల వంచు || 
నమ్ముదును నే నమ్ముదును ||

8.మహికర్మ పరిహారమును 
దేహ పునరుత్థానము 
బహుళము నిత్య జీవమును 
మహిమ యనంతమై వెలయు నని || 
నమ్ముదును నే నమ్ముదును ఆమేన్||

No comments: