నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి - నీజాడలు సారమును వెద జల్లుచున్నవి (2)
బల సౌందర్యములు - పరిశుద్ధ స్థలములో ఉన్నవి -
ఘనతా ప్రభావములు - ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2)
మాపై నీ ముఖ కాంతిని - ప్రకాశింపజేయుము యేసయ్యా
1. నీ ఆలోచనలు గంభీరములు - నీ శాసనములు హృదయానందకరములు (2)
నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి - నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2) ||బల సౌందర్యములు||
ఎవర్లాస్టింగ్ ఫాదర్.. యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్
ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్ - మై జీసస్
నిత్యుడైన తండ్రి.. నీ కృప నిరతము నిలచును
నిత్యుడైన తండ్రి – నా యేసయ్య - నా యేసయ్య
2. నీ రూపము ఎంతో మనోహరము - నీ అనురాగము మధురాతి మధురము (2)
నీ నామము నిత్యము పూజింపతగినది - నీ విశ్వాస్యత నిరతము నిలచునది (2) ||బల సౌందర్యములు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment