12 September 2021

"అయితే శరీరములో వివాదములేక యుండుడి".1 కొరింథీయులకు:12:24

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
నేడు దిన ధ్యానము:-

(ఏకశరీరము)

“అయితే శరీరములో వివాదములేక యుండుడి”.
1 కొరింథీయులకు 12:24

ఇక్కడ పౌలు మనలని పాలిభాగస్థులుగా ఉన్న సంఘమును ఒకే శరీరముతో పోల్చుచున్నాడు. క్రీస్తునందు సహోదరులమైన మనము వేరువేరుగా ఉండుట కన్నా ఐక్యముగా ఉండుట ఎంతో మంచిది.

కానీ ఈనాడు క్రైస్తవులను మనం గమనిస్తే వారు ఆరాధించే విధమును బట్టి, ఆచారములను బట్టి భేదములు కలిగి విడిపోయి పరలోకమందున్న తండ్రిని సిగ్గుపరచి ఆయన యొక్క మనసును ఆయాసబెట్టుచున్నారు.

గనుక నేడే సంఘమంతయూ ఏకశరీరముగా ఉండి ఏకమనస్సును కలిగి, వరునిగా వచ్చుచున్న క్రీస్తు కొఱకు వధువువలె సిద్ధపడుటకు ప్రార్థించెదము.

ప్రార్థనా:
ప్రియమైన తండ్రి! ఈ సమయములో సంఘమంతయూ భేదములు విడిచి ఏకశరీరముగా ఏకరీతిగా నడుచుకోవాలని ప్రార్థించుచున్నాను. నీ రెండవరాకడలో వరునిగా వచ్చుచున్న నీ కొఱకు సిద్ధపడుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...