సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం - మన హృదయము ప్రభు కొరకై
సిద్ధమనస్సను జోడు తొడిగి - సమాధాన సువార్త చాటెదం (2) సమాధాన సువార్త చాటెదం ॥సిద్ధపడుదాం॥
1. ప్రతి ఉదయమున ప్రార్ధనతో - నీ సన్నిధికి సిద్ధమవుదును - జీవము కలిగిన వాక్కులకై -
నీ సన్నిధిలో వేచియుందును (2) ॥సిద్ధమనస్సను॥
హల్లెలూయ ....(4)
హోసన్నా.... హోసన్నా....
హల్లెలూయ.... హోసన్నా
2. సత్కార్యముకై సిద్ధపడి - పరిశుద్ధతతోనుందును -
అన్నివేళలయందు ప్రభుయేసుని -
ఘనపరచి కీర్తింతును (2) ॥సిద్ధమనస్సను॥
3. బుద్ధిని కలిగి నీ రాకడకై - మెలకువతో నేనుందును -
నీ రాజ్య సువార్తను ప్రకటించి -
ప్రతివారిని సిద్ధపరతును (2) ॥సిద్ధమనస్సను॥
No comments:
Post a Comment