సిలువలో నెత్తుటి ధారలు - సాతానునికే చితి మంటలు - హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ(2) ||ఇది||
1. మోహపు చూపుల మనిషి మోముపై - ఉమ్మి వేసెను, ఉమ్మి వేసెను -
మోసపు తలపుల మనిషి శిరస్సుపై ముళ్ళ కిరీటం, ముళ్ళ కిరీటం -
పాపా తనువున కొరడా దెబ్బలు - శాప కరముల కఠిన శీలలు -
అపవాదికే అంత్య క్రియలు ప్రభు యేసుకే విజయ గీతికలు ||ఇది||
1. లోక పాపమును శోక భారమును - సిలువ వేయుటే తండ్రి చిత్తము -
పాప క్షమాపణ శాప విమోచన సాధించుటయే తనయుని త్యాగము -
మానవాళికి మోక్ష మార్గము - మానవాత్మలకు రక్షణ భాగ్యం(2) - సిలువ సునాదం పునారుద్దానం - పరిశుద్ధాత్ముని ఘన సాక్ష్యం ||ఇది||
No comments:
Post a Comment