4
దేవుని యనూనత్వములు
రా – కేదారగౌళ, తా - ఆది
దేవా - ¹దివ్యానంత ప్ర - భావ మాంపాహి ఘన యె - హోవా = ²స్థావహోవ ³జంగమ సహిత ⁴నిఖిల జగ - ⁵దావన పావన - భావ నిరంతర llదేవాll
1.⁶సార - కారుణ్యపారా - వారా - సర్వజ్ఞ నిర్వి - కారా యేసు నామావ - తార - దీన జనోప - కారా = ఘోరమైన సం - సారటవిం బడి - దారిఁ గనని నన్ను జేరఁబిలిచితివి llదేవాll
2.⁷అక్షీ - ణ విభవానంద - మోక్ష - రాజ్య మహిమా - ధ్యక్ష - సంతత సుజన రక్షా - కపట దుర్మనుజ - శిక్షా = ⁸పక్ష విపక్ష వి - లక్షణ రహిత క - టాక్షము నాదెస - దీక్షను నిలుపవె llదేవాll
3.సుంద - రాశ్చర్య ⁹గుణ బృందా - ¹⁰బంధుర నిత్యా - నందా - సాధు సజ్జన ¹¹వంద్యా - ¹²ఖండిత కలుష బృందా = మంద మతిని నా - డెందము కడుఁ దెలి - వొందఁ జేసి నీ యందు నిలుపఁ గదె ॥దేవాll
4.నీవు - నన్ను సృష్టించి - నావు - నా గురురాడ్డేవుఁ డవు - క్రీస్తు యేసుని - చావు వలన నన్మనిపి - నావు = పావన జనక సు - తాత్మలతోడను గేవల మొక్కఁడ - వై వెలిఁగెడి ప్రభు llదేవాll
5.ప్రేమ స్వరూప నిత్య - క్షేమ - ¹³పతిత పావన - నామ - ¹⁴దాస లోకబ్ది - సోమ సర్వేశ పరమ = ధామ నేమ మెఱుంగని - నీచుఁడ నధముఁడ - నో మహాత్మ దయ తో మన్నింపవె llదేవాll
- పురుషోత్తము చౌదరి
________________________________
¹మితిలేని దివ్య మహిమగలవాఁడా. ²నన్ను రక్షించుము. ³చలింపనివాటితోను చలించువాటితోను గూడుకొనిన. ⁵రక్షింపవలెనను పరిశుద్ధభావము నిరంతరము కలవాఁడా. ⁶సారమైన కరుణకు సముద్రుఁడా. ⁷తరగని భాగ్యమును ఆనందమును గలవాఁడా. ⁸శత్రు మిత్ర్వభావములనెడు విరుద్ధ గుణములు లేనివాడు. ⁹గుణానమూహము కలవాఁడా. ¹⁰దట్టమైన నిత్యానందము కలవాడా. ¹¹సమస్కరింపఁబడదగినవాడా. ¹²ఎంతమాత్రము పాపము లేనివాఁడా. ¹³పాపులను పవిత్ర పర్చువాఁడనుపేరు కలవాఁడా. ¹⁴దానసమూహమను సముద్రమునకు చంద్రుని వంటివాఁడా.
No comments:
Post a Comment