22 June 2021

Calvin Wilson Mateer | కాల్విన్ విల్సన్ మటీర్

 📚 *ఒక మిషనరీ జీవిత చరిత్ర* 📚 
🛐 *కాల్విన్ విల్సన్ మటీర్ Calvin Wilson Mateer* 🛐

జననం: 09-01-1836
మహిమ ప్రవేశం: 28-09-1908
స్వస్థలం: పెన్సిల్వేనియా
దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
దర్శన స్థలము: చైనా 

 కాల్విన్ విల్సన్ మటీర్ చైనాలోని షాంటుంగ్ పరిధిలో మొదటిగా సేవ చేసిన మార్గదర్శకులైన ప్రెస్బిటేరియన్ మిషనరీలలో ఒకరు. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మటీర్, అతని తల్లియైన మేరీ యొక్క భక్తిగల ఆత్మీయ జీవితము ద్వారా బాగా ప్రభావితులయ్యారు. సువార్తను అన్యజనుల దేశములకు తీసుకువెళ్ళవలెనని ఎల్లప్పుడూ తన పిల్లలను ఎంతగానో ప్రోత్సహించేవారు మేరీ. కాగా వారి ఏడుగురు పిల్లలలో ఆరుగురు దేవుని సేవకు తమను సమర్పించుకున్నవారిగా ఉన్నారు. 1855వ సంll లో జెఫెర్సన్ కళాశాల నుండి పట్టా పొందిన తరువాత, ‘వెస్ట్రన్ థియోలాజికల్ సెమినరీ’ అనే బైబిలు వేదాంత కళాశాలలో చేరారు మటీర్. అటు పిమ్మట అతను సువార్తను ప్రకటించుటకుగాను తన భార్యయైన జూలియాతో కలిసి 1863వ సంll లో చైనాకు పయనమయ్యారు.

 చైనాలో అతను షాంటుంగ్ పరిధిలోని టెంగ్‌చోకు చేరుకున్నారు. ఆ ప్రాంతం సాంప్రదాయబద్ధమైన ప్రదేశముగాను మరియు మిషనరీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత కలిగియున్నదిగాను ఉండేది. కాలినడకన లేదా గాడిదపై వేలాది మైళ్ళు ప్రయాణించి షాంటుంగ్ పరిధి ప్రాంతమంతటా సంచార సేవ జరిగించారు మటీర్. అతను ఎంతో శ్రమించి ఉత్తమమైన పరిచర్య చేసినప్పటికీ, అక్కడ మారుమనస్సు పొందినవారు అతి కొద్దిమంది మాత్రమే. స్థానిక ప్రజలలో ప్రబలముగా ఉన్న విగ్రహారాధన, నల్లమందు వాడకం మరియు వ్యభిచారం కారణంగా అతను ఎంతో నిరుత్సాహపడ్డారు. తద్వారా క్రైస్తవ్యమును వారికి బోధించే ముందుగా ప్రజలకు విద్యాభ్యాసమును అందించవలసిన ఆవశ్యకత ఉందని అతను గ్రహించారు.

 తత్ఫలితముగా అతను తన భార్య జూలియా నడుపుతున్న బాలుర పాఠశాల మీదకు తన దృష్టిని మళ్ళించి, స్థానిక విద్యావ్యవస్థలో మార్పు తీసుకువచ్చుటకై గొప్ప ప్రయత్నాలు చేశారు. కాగా క్రైస్తవ బోధలకు విరుద్ధమైన కన్ఫ్యూషియన్ అనే తరతరాలుగా ఉన్న సంప్రదాయబద్ధమైన రచనలను బోధించవలసి ఉండడం, చైనావారైన ఉపాధ్యాయులను నియమించడం మరియు తిరుగుబాటు ధోరణి కలిగియున్న పిల్లలను నియంత్రించడం వంటి అనేక సవాళ్ళను వారు ఎదుర్కొనవలసి వచ్చింది. మటీర్ క్రమక్రమంగా నూతన విధానములను, ఉదాహరణకు చైనా యొక్క సంప్రదాయబద్ధమైన విద్యతో పాటు పాశ్చాత్య విజ్ఞాన విభాగాలను ప్రవేశపెట్టడం, బోధనలలో క్రైస్తవ విలువలను మరి అధికముగా నొక్కివక్కాణించడం మరియు ఆంగ్లములో కాకుండా చైనా భాషలోనే బోధించడం వంటివాటిని ప్రవేశపెట్టారు. కాగా కొద్దికాలంలోనే ఆ పాఠశాల ఒక క్రైస్తవ కళాశాలగా అభివృద్ధి చెందింది. తదుపరి అది ప్రస్తుతమున్న “షాంటుంగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ” గా (షాంటుంగ్ క్రైస్తవ విశ్వవిద్యాలయంగా) మారింది. అతను కళాశాలలోని ప్రతి తరగతి నుండి ఒక ఉత్తమ విద్యార్థిని ఎంపికచేసి, వారికి ఉపాధి కల్పించి, అటువంటి క్రైస్తవ విద్యాసంస్థలను నిర్మించుటకును మరియు దేవుని రాజ్యము యొక్క ఎల్లలను విస్తరింపజేయుటకును చైనాలోని ఇతర ప్రాంతములకు వారిని పంపేవారు.

 అంతేకాకుండా క్రొత్త నిబంధన గ్రంథము మాండరిన్ భాషలోకి అనువదించబడుటలో కూడా తన వంతు సహాయమందించారు మటీర్. పలు విధ కష్టాలు, వైరుధ్యాలు మరియు శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ, చైనా దేశములో క్రీస్తు కొరకు గొప్ప కార్యములను సాధించుటకై తన శాయశక్తులా శ్రమించి, తన చివరి శ్వాస వరకు కూడా వెనుదిరుగక ముందుకు సాగిపోయారు కాల్విన్ విల్సన్ మటీర్.

🚸 *ప్రియమైనవారలారా, మీ పరిచర్యలోని లోపములను గుర్తించి, వాటిని పరిష్కరించుటకు మీరు ప్రయత్నించుచున్నారా?* 🚸

🛐 *"ప్రభువా, స్వల్పకాలమే నిలిచియుండే శ్రమల మధ్యలో, స్థిరముగా నిలువబడి మీ సేవలో ముందుకు సాగిపోవుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
*******
*ఒక మిషనరీ జీవిత చరిత్ర* ద్వారా మీరు ప్రయోజనం పొందినట్లయితే, ఇతరులు కూడా ప్రయోజనం పొందులాగున దీనిని అందరికీ పంపి, *ప్రభువును సేవించుటకు* వారిని ప్రోత్సహించ మనవి!
*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
*******
తెలుగు అనువాదం: ఆర్. ఆర్. ప్రియాంక

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...