Sarva shakthuni sthothraganamu | సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే

8
సర్వశక్తుని స్తోత్రగానము
రా - బిలహరి, రా - త్రిపుట
(చాయ: యేసునాధ కథా సుధారస)

  సర్వ శక్తుని స్తోత్రగానము - సల్పరే జగ మెల్లను = నిర్వహించును దాస భారము - నిత్య మెద రాజిల్లను ||సర్వ||

1.ముదముతో నిర్మాణకుండగు - మూల కర్తను బాడరే = వదన ¹మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేఁడరే ||సర్వ||

2.వేదపారాయణము సేయుచు - విశ్వ మంత జయింపరే =  సాదరముగా దేవు నిఁక మీ - స్వాంతమునఁ బూజింపరే ||సర్వ||

3.ఎదను విశ్రాంతిన్ పరేశుని - హెచ్చుగా నుతిఁజేయరే =  సదమలంబగు భక్తితో మీ - సర్వ మాయన కీయరే ||సర్వ||

4.చావు పుట్టుక లేనివాఁడుగ - సంతతము జీవించును = ఈవు లిచ్చుచుఁ దన్ను వేఁడు మ - హేష్టులను రక్షించును ||సర్వ||

5.దాసులై దేవునికి నెదలో ²దర్పమును బోఁగాల్పం = యేసు క్రీస్తుని పుణ్యవస్త్రము - నే మరక మైదాల్పరే ||సర్వ||
                          - మిక్కిలి సమూయేలు
___________________________
 ¹భూమిపై వంచి. ²గర్వమును.

No comments: