నీఆత్మలో నింపుకో - నీరూపులో మార్చుకో
నీసేవకై వాడుకో - నన్ను నీసేవలో నిలుపుకో(2)
||తండ్రీ||
1. పలుమారులు నే పడుచున్నను
నీఆత్మతో నన్ను పట్టుకో
దారితెలియక పరుగెత్తగా -
నీ త్రోవలో నన్ను నడిపించుకో(2) ||తండ్రీ||
2. సాతాను శోధనలు అధికమైనా
నీ రెక్కల చాటున దాచుకో
సొమ్మసిల్లి నే పడియుండగా -
నీ కంటి పాపగా నన్ను చూసుకో (2) ||తండ్రీ||
3. ఆపదలు నన్ను దరిచేరగా
నా మంచి కాపరివై కాచుకో
తుఫాను లెన్నో చెలరేగగా -
ఆవలి తీరము నన్ను చేర్చుకో (2) ||తండ్రీ||
4. నా అన్న వారు నన్ను విడువగా
కన్న తండ్రి వై నన్ను చూసుకో
ఇహ లోక యాత్ర నే ముగియగా
పరలోక రాజ్యము నను చేర్చుకు (2) ||తండ్రీ||
No comments:
Post a Comment