అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే
అ.ప: ఆహాహా - హల్లెలూయా (3) ఆహా ఆమేన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం ||అత్యు||
2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్త స్తోత్రం ||అత్యు||
3. ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా - అత్యున్నతుడా స్తోత్రం ||అత్యు||
4. యుగయుగములు సజీవుడా స్తోత్రం - తరతరముల దేవుడవు స్తోత్రం
ఏడు దీప స్థంభముల - మధ్య సంచరించే
జ్యోతిర్మయుడా స్తోత్రం ||అత్యు||
5. అతి కాంక్షణీయుడా స్తోత్రం - అతి సుందరుడా స్తోత్రం
అతి మనోహారుడా - మహిమాన్వితుడా - ఆరాధ్యుడా నీకు స్తోత్రం ||అత్యు||
6.స్తుతులపై ఆసీనుడా స్తోత్రం - సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలను ఆలకించువాడా - మా ప్రధాన యాజకుడా స్తోత్రం||అత్యు||
7.మృత్యుంజయుడా స్తోత్రం - మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం ||అత్యు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment