దేవుని సమాధానం కొరకు సాతాను తో పోరాటము

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:⛪-

✝️ *దేవుని సమాధానం కొరకు సాతాను తో పోరాటము*✝️

ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగును. 
 యోబు. 22:21

విశ్వాస జీవితం పరుగు పందెం వంటిది మాత్రమే కాదు. అదొక యుద్ధరంగం పాపమే విశ్వాసికి శత్రువు. విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉంటారు. వారు దేవుని సైనికులు కాబట్టి పోరాడుతూ జయించేందుకు తగిన సాధన, సంపత్తి వారికి ఉండాలి. ఇందుకు శక్తి బలం చాలవు. దేవుని సైనికునికి దేవుని బల ప్రభావాలు అవసరం. వాటికోసం ఆయన వైపే చూడాలి. ఆయనే ఆయుధాలు ఇస్తాడని నమ్ముకోవాలి. పౌలుకు రోమా సైనికులు పోరాడే తీరు బాగా తెలుసు అందుకే సగం కవచం వేసుకుంటే సగం విజయం కాదు అసలు విజయమే కలగదు. అలాంటి వారికి అది ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది. క్రీస్తు లేని విశ్వాసుల కోసం దేవుడు ఆధ్యాత్మిక కవచాన్ని తయారు చేశాడు. రక్షణ అనే శిరస్త్రాణం న్నీ న్యాయమనే ఛాతి కవచాన్ని ధరించాలి. కావచమును ప్రతీ విశ్వాసి ఖచ్చితంగా వేసుకోవాలి. లేకపోతే సాతాను కుతంత్రాలను ఎదిరించి నిలబడలేక పడిపోతాము. యోబు దేవునితో సహవాసం చేస్తూ, ఆ కవచాన్ని ధరించి సాతాను పై విషయం పొందుకున్నాడు. నీవు కూడా నీ జీవితంలో బాధలు కష్టాలు వచ్చినా అది దేవుని ప్రేమే గాని ఆయన కోపం కాదని గ్రహించి, దేవుడు ఇచ్చే ఆధ్యాత్మిక వస్త్రాలను ధరించి యోబు వలె ఎదిరించి నీ జీవితంలో అన్ని విజయాలే పొందుకోవాలి.

 🛐*ప్రార్ధన*🛐
నా రక్షక మీ యొక్క సమాధానం కలిగి మీ ఆత్మ చేత నన్ను బలపరిచి, సాతాను పై జయమును కలిగించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

No comments: