విడువని బంధమా - మరువని స్నేహమా
మమతానురాగాలే - నీ మకరందమా !
చెదరని నీ చిరునవ్వే - చెరిగిపోని జ్ఞాపకాలే
కృప కనికరములే - నీ సౌందర్యమా ||విడువని||
మమతను పంచిన మహనీయుడా
మేలుచేయుటలో దయాళుడా
సమృద్ధి నిచ్చిన శ్రీమంతుడా
కృపచూపుటలో ఐశ్వర్యుడా ||విడువని||
విడువని బంధము నీవేనయ్య
మరువని స్నేహము నీవేనయ్య
చెదరని నవ్వే నీదేనయ్య
నా చెరగని జ్ఞాపకం నీవే యేసయ్య
1. నాలోన నీవని - నీతోనే పయనమని - నీవు లేకపోతే నేను లేనని - నీవే నా ప్రాణమని -
నీతోనే మరణమని - నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్ధమని (2)
వాగ్దానం చేసినవారు - నను విడచి వెళ్ళినారు
నిబంధన చేసి నాతో - నను మరచి పోయినారు
నను ఎన్నడు విడువని మరువని బంధము నీవయ్య
నాతోడై నిలచి నడిచిన స్నేహము నీవయ్య
విడువని బంధము నీవేనయ్య - మరువని స్నేహము నీవేనయ్య
చెదరని నవ్వే నీదేనయ్య - నా చెరగని జ్ఞాపకం నీవే యేసయ్య ||విడువని||
2. కన్నీటి లోయలో - కలతచెందె నా ప్రాణం - కరుణించు వారులేక - కృంగిపోయెనే -
కష్టాల కౌగిలిలో - కలవరపడే నా హృదయం - ఓదార్చువారి కోసం ఎదురు చూసెనె (2)
నా దుఃఖ దినములలోన - దరికెవ్వరు రానేరాక
నా ఒంటరి బ్రతుకులోన - తోడెవ్వరు లేనేలేక
పగిలిన నా గుండెకు నీవు ఔషధమైనావు
నలిగిన నా మనస్సుకు నీవు నెమ్మదిఅయినావు
కలతలు బాపిన నా యేసయ్య -
కన్నీరు తుడచిన నా దైవమా
మేలులతో నింపిన మహోన్నతుడా -
మహిమలు చేయు మహాఘనుడా ||విడువని||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment