Yehovanu sthuthinchuta manchidi | యెహోవాను స్తుతించుట మంచిది

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా 
నీ నామమును కీర్తించుటయు బహుమేలైనది ||యెహోవాను||

1.పది తంతుల సర్వమండలముతోను - 
గంభీరధ్వని గల సితారతోను - 
యెహోవా నినుగూర్చి ప్రచురించుట మంచిది ||యెహోవాను||

2.ఉదయమున నీకృపయు ప్రతిరాత్రియందు -
నీదు విశ్వాస్యతను తాళ - వాయిద్యములతోను -
వాయించి నిన్ను గూర్చి ప్రచురించుట మంచిది ||యెహోవాను||

3.ఎందుకనగా యెహోవా నీ కార్యముచేత -
నీవునన్ను సంతోషపర్చు చున్నావు - 
నీచేతి పనులను బట్టి నే ప్రోత్సాహించుచున్నాను ||యెహోవాను||

4.యెహోవా నీకార్యములు ఎంతో దొడ్డవి-
నీ ఆలోచనలతి గంభీరములు -
పశుప్రాయులు గ్రహింప రవివేకులు వివేచింపరు ||యెహోవాను||

5.చెడుపనులు చేయువారు పుష్పించుదురు -
గడ్డివలె చిగుర్చుదురు నిత్యనాశానము -
నొందుటకే గదా పెరుగుదురు ||యెహోవాను||

No comments: