1. పాపకూపములో బడియున్న - నన్ను జూచి చేయి జాచి చక్కగా దరికి జేర్చితివి ||జై జై||
2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా పరిహరించిన - పావనుడగు నా ప్రభు యేసు ||జై జై||
3. నీతిహీనుడనైన నాకు - నీతి రక్షణ వస్త్రములను - ప్రీతితో నొసగిన నీతిరాజ ||జై జై||
4. మంటిపురుగునైన నన్ను - మంటి నుండి మింట జేర్చిన - మహాప్రభుండా నీకే జై జై ||జై జై||
5. పాపశాప గ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయ సంపార్యముగా మార్చతివి ||జై జై||
6. రాజులైన యాజకగుంపులో - నన్నుగూడ నీ సొతైన సంపాద్యముగా మార్చితివి - పరిశుద్ధ జనములో జేర్చితివి ||జై జై||
7. తల్లియైన మరిచిన మరచును - నేను నిన్ను మరువననిన నమ్మకమైన నా ప్రభువా ||జై జై||
8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది అంతములేని స్వామి - యుగ యుగములకు నీకే జై జై ||జై జై||
No comments:
Post a Comment