Nammadaginavaadavu Sahayudavu | నమ్మదగినవాడవు సహాయుడవు

నమ్మదగినవాడవు సహాయుడవు యేసయ్యా
ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా (2)
చెర నుండి విడిపించి చెలిమితో బంధించి
నడిపించినావే మందవలె నీ స్వాస్థ్యమును (2) ||నమ్మదగిన|| 

1. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే
శత్రువుల కోటలన్ని కూలిపోయెను
సంకెళ్ళ సంబరాలు మూగబోయెను (2)
నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యానందభరితులై సీయోనుకు తిరిగివచ్చెను (2) ||నమ్మదగిన|| 

2. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
సమృద్ధి జీవముతో పోషించితివి (2)
ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను (2) ||నమ్మదగిన|| 

3. నా బలహీనతయందు శ్రేష్ఠమైన కృపనిచ్చితివి 
యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి
అర్హమైన పాత్రగ నను నిలుపుకొంటివి (2)
ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము (2) ||నమ్మదగిన||
__________________________________
Nammadagina vadavu sahayudavu yesayyaa
aapatkalamulo aasrayamainadi- neevenayyaa(2)
chera numdi vidipimchi chelimito bhandhinchi
nadipimchinaave mamdavale nee -svaasdhyamunu (2) ||Namma||

Nee janulaku neevu nyayaadhipativaitivea Satruvula koetalanni kuulipoyenu
samkell sambaraalu muugaboeyenu (2)
nee janulaku neevu nyaayadhipathivaitive
neerikshana kartavaina ninnea nammina prajalu
nithyanamda bharitulai seeyonu ku tirigi vachenu (2)  ||Namma||

Nee priyulanu neevu kaapaade manchi kaapari
jatilamaina throvalanni daatinchithivi
samruddhi jeevamutho poshinchithivi (2)
aalochana karthavaina nee swarame vinaga
nithyaadarananu pondi nee kriyalanu vivarinchenu (2) ||Namma||

Naa balaheenathayamdu Sreshtamaina krupa nichithivi
yogyamaina daasuniga malachukontivi
arhamaina paatragananu nilupukontivi (2)
aadarana karthavai viduvaka todainilichi
sarvottamamaina maargamulo nadipinchumu (2)  ||Namma||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: