ఆకాశము నీ సింహాసనము - భూమి నీ పాదపీఠము (2)||నీవంటి||
1. భూమంతయు దాని అంతమంతయు - నీ చేతి కార్యములు =
జలరాశులు సకల ప్రాణులంతయు - నీ దయకు తీపి గురుతులు
మానవజాతి నీ ప్రేమకు చిహ్నం - సృష్టించినావు నీ రూపులో (2)||నీవంటి||
2. నీవు సృష్టించిన మనుషులందరూ - సృష్టికర్తను నిన్ను మరచితిమి =
నా చేతి పనినే నమ్మితిమి - వాటిని మేము పూజించితిమి తండ్రియైన నీవు విలపించి మాకై - ఏసుగా ఏతెంచితివి (2) ||నీవంటి||
3. జీవ వాక్యం శరీరధారియై- మన మధ్యన నివసించెను =
ప్రతి పాపమును తానే మోసి - సిలువపై మరణించెను -
పాపక్షమాపణ మనకు ఇచ్చెను - పరలోకరాజ్యముకు దారి చూపెను(2) ||నీవంటి||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment