255
దేవుని వాక్యానందం
రా - మోహన, తా - అట
సుఖ మిచ్చెగద మాకు - ప్రభుయేసువా నీ - సురుచిరమగు వాక్కు = నిఖిలకల్మష వనమునకు దవ - శిఖి శిఖిలవలె గాల్చు నీదగు - ముఖవికాసిత వాక్యములు బహు - సుఖము లొసఁగు తవాశ్రితాళికి ||సుఖ మిచ్చె||
1.జగతిలోపల మెండుగ - నుండిన వివిధ - మగు శాస్త్రములు జూడఁగ = మిగుల గందరగోళమై మరి - యొకటి కొకటి విరుద్ధముగ మ - ర్త్యగణ కల్పిత మగుచు నున్నవి - తగని వని ద్రోచితిమి వాటిని ||సుఖ మిచ్చె||
2.నీ వాక్యముల భావము - నమ్మిన పాపి - జీవుల కది జీవము = కేవలం బగు ధర్మశాస్త్రము - దేవుఁ డిచ్చిన దొకటి బైబిలు - ఈ వసుధఁగల సర్వ పాపులఁ బ్రోవ వచ్చిన నిన్నుఁ జూపెను ||సుఖ మిచ్చె||
- పురుషోత్తము చౌదరి
No comments:
Post a Comment