247
పరిశుద్ధాత్ముని ప్రాపు
(ఛాయ: అన్ని కాలంబుల)
రా - కాంభోజీ, తా - అట
పరిశుద్ధాత్మ ప్రభుని - వరదివ్యశక్తిబం - ధురము ధరణికిజీవ - సంజీవము - పరమౌన్నత్యంబైన - పరలోక సువిశేష - పరమార్థములు దెలుపు నెఱిమార్గము ||పరి||
1.ఆపత్కాలమునందు - ప్రాపయి మానవజాతి - కాపయి సంరక్షించి - ఏపారును = పాపాంధకారమున బడి మ్రగ్గి శోకించు - పాపజాతికి దీప రాశియై రహియించు - కృపయు కనికరములు గుంఫించి - మధురాతి - ప్రభగా భాసిల్లెడు పరమార్థము - అపభ్రంశకార్యముల కెపుడు తావీయక - సుపురోగతిని జూపి శోధించును ||పరి||
2.బండలనుపమించు - గుండియల కదలించు - నిండుశక్తి ఘటించు నీతి బెంచు = ఎండిన యెదలను నిండించు రక్షణో - ద్దండ విలసిత భాగ్య దానమ్ములు - దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి- మెండుగా నాదరము మేళవించి - మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల - నుండి పాపిని గాచు నండయౌచు ||పరి||
3.శాంతి సమాధాన - సౌజన్యభావమ్ము - కాంతిమంతము గల్గు కారుణ్యము = అంతములేనట్టి - ఆనంద శుద్ధాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు = ఎంతో సంతోషముతో - అంతుబొంతులేని వి - క్రాంతి బలత్యాగముల - గావింప జేయు - చింతా ధ్వాంతములోన చెదరికొట్టుకపోవు - శాంతిలేని జనతకు - సౌఖ్యాస్పదము ||పరి||
No comments:
Post a Comment