246
పరిశుద్ధాత్మకొరకై ప్రార్థన
(చాయ: తనువునాదిదిగో గైకొనుమి)
రా - యదుకుల కాంభోజి, తా - త్రిపుట
పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! - వరదా! మా హృదయమం - దిరముల వసి యింపుమా = అరుదైన నీదివ్య - తరశక్తులను దాల్చి - త్వరగా మాపై దిగుమా కరుణాబ్ధివై యిపుడు ||పరిశుద్ధాత్ముఁడ||
1.పరమండలాగ్నివై - యరుదెంచి మా హృదయాం - తర దురితతూలం బును = దరికొల్పి పరిశుద్ధ పఱచి మా - యాత్మల మా వరరక్షకునకు న-ర్పణ ముగా నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ||
2.కాంతులీనెడు దీప - కలికవైవచ్చి మా - స్వాంతంబులఁగప్పిన = యంతు లేని యవిద్యా - ధ్వాంతంబుఁ జోపి సు - స్వాంతులేగెడు సత్య సరణిఁ జూపింపుమా ||పరిశుద్ధాత్ముఁడ||
3.చలువఁ గూర్చెడు మంచు-జల్లురూపమున మ - మ్ముల నెల్ల దీవింపుమా = ఫలశూన్యంబైన యా - ఆత్మలకు నీ బల మొసఁగి-ఫలవంతములుగ గే-వలుఁడా యొనరింపుమా ||పరిశుద్ధాత్ముఁడ||
4.పరమ పారావతమా!-పక్షములు విప్పి మా - శిరములపైని చాఁచి = పరమందు నీ సంఘ - పరిశుద్ధులకువలెనె - ధరనున్న మాకు నీ - వరముల నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ||
5.దివినుండి భువికి నా - రవముతో వీతెంచు - పవమానాకారుండవై = నవ జన్మసంప్రాక్తికవరోధమొనరించు - భవదుఃఖాంబుద పటలిఁ బాఱఁ దోలుము కృపచేఁ ||పరిశుద్ధాత్ముఁడ||
6.అందమౌ నీమోము - నందుఁ జిందెడు తేజ-మందఱు వీక్షింపగా = విందవై వచ్చి మా - డెందంబులకు నిత్యా - నందంబుఁగూర్చి మా - వందనంబులు గొనుమా ||పరిశుద్ధాత్ముండ||
- దాసరి మోజెస్
No comments:
Post a Comment