18 October 2026

వీరుల మయ్యా జయ వీరుల మయ్యా Veerulamayya jaya veerulamayya


359
క్రైస్తవ వీరులు
రా - శంకరాభరణం,  తా - ఆది 

వీరుల మయ్యా - జయ - వీరుల మయ్యా - మా = వైరిఁ జంప యుద్ధమాడు - శూరుల మయ్యా ||వీరుల||

1.మాంస లోక పి-శాచి - హింసపరచిన - మము = ధ్వంసముఁజేయ పై బడిన - ధ్వజము విడమాయా ||వీరుల||

2.పరమ గురు వగు - యేసు - ప్రభువు నాజ్ఞను - బహు = త్వరగఁ బ్రజకుఁ బయలుపర్చు - భటుల మే మయా ||వీరుల||

3.అతి దుష్ట ద్రోహులు - మము - వెతలఁ బెట్టిన - నీ =క్షితి సువార్త కొఱ కొకింత - సిగ్గు పడ మయా ||వీరుల||

4.భూలోక నాధులు - చాల - పోరు సల్పిన - మా = వేలుపునకుఁ బ్రాణ - మైనఁ బెట్టువారము ||వీరుల||
- ఏ. జెఖర్యా 

No comments:

Recent Post

వీరుల మయ్యా జయ వీరుల మయ్యా Veerulamayya jaya veerulamayya

359 క్రైస్తవ వీరులు రా - శంకరాభరణం,  తా - ఆది  వీరుల మయ్యా - జయ - వీరుల మయ్యా - మా = వైరిఁ జంప యుద్ధమాడు - శూరుల మయ్యా ||వీరుల|| 1.మాంస లోక ...