ఓ వినుము సోదర పరమ O vinumu sodara


ఓ వినుము సోదర పరమ గురుని బోధ - నమ్మిన తొలగు నరక బాధ (2) 
కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి (2)
జగమునందు ఎందెందు వెదకినా నీతిపరుడు లేడు - 
దేవుని వెదకు వారు లేరు (2)||వినుము ||

1. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి .. (2) 
ఎంత పనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి - 
నరకపు బాధ గొప్పదండి (2)||వినుము ||

2.నరకమనగా పూదోట కాదది అగ్నిగుండమండి...(2)
అగ్నిఆరదు కాలెడివారికి చావు రాదు సుమ్మి -
విడుదల పొందలేరు అండి (2)||వినుము ||

3.ఏమి చేసి ఆ నరక బాధ తప్పించు కొందురండి (2)
వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్ధము సుమ్మండి - పాపము బాపలేవు అండి (2) ||వినుము ||

4. ఆదిదేవుడే మిమ్మునెల్ల తప్పించనెంచినాడు (2)
రెండు వేయిల ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు -
నరుడై తాను పుట్టినాడు (2)||వినుము ||

5.ఆకాశమందున సూర్యుని వలెనె దేవుడొక్కడండీ (2) 
నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుమ్మి - వెలుపల వెదకి దండగండి ||ఓ వినుము||

No comments: